Saturday, May 3, 2025
Homeజిల్లా వార్తలుమే డే స్ఫూర్తితో ఉద్యమించాలి

మే డే స్ఫూర్తితో ఉద్యమించాలి

బీఆర్ టీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: ఎన్నో పోరాటాలు, త్యాగాల వల్ల సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా చట్టాల సవరణను చేయడం సరికాదని బీఆర్ టీయూ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. మేడే ను పురస్కరించుకొని బీఆర్ టీయూ అనుబంధం సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్, మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం, ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ దగ్గర, ఐస్ క్రీమ్ కార్మికుల ఆధ్వర్యంలో పాత ఎమ్మార్వో ఆఫీస్ ముందు, రిక్షా కార్మికులు, షాపు గుమస్తాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఘనంగా మేడే ఉత్సవాలు జరిపి ఎర్ర జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 42 రకాల కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్ లుగా చేస్తూ పార్లమెంటులో చట్టాలు చేయడం సరికాదన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మికులు సంఘటితమై సమ్మె చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, దాడువా యూనియన్ రాష్ట్ర నాయకులు పెరమండ్ల రవి, జిల్లా అధ్యక్షుడు నాయిని వేణుచంద్, హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడిచెర్ల శీను, డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్, నాయకులు అన్నం రాజు, గాండ్ల రాములు, కడారి అనిల్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాదాసి నర్సింగరావు, గడ్డం సమ్మయ్య, అధ్యక్షుడు అల్వాల రాజు, రిక్షా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు వేడిగా శ్రీనివాస్, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు రాజు, ఐస్ క్రీమ్ యూనియన్ అధ్యక్షుడు అన్న బోయిన రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments