‘మాస్టర్’ స్ట్రోక్..
వణికిపోతున్న అధికార పార్టీ
రద్దుకు తీర్మానాలు..
ఎన్నికల వేళా ప్రభుత్వంపై వ్యతిరేకత..
వెనక్కి తగ్గేందుకు నిర్ణయం..
రద్దు చేస్తూ కౌన్సిల్ తీర్మానాలు..
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్ర సర్కార్ కు ‘మాస్టర్’ స్ట్రోక్ తగిలింది. ఎన్నికల వేళా నిరసనలు రుచి చూసింది. రైతుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత.. ఎగిసిపడింది. నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో ఆగమాగం అయింది. దీంతో ప్రభుత్వం మాస్టార్ ప్లాన్ పై వెనక్కి తగ్గింది. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కొత్త మాస్టర్ ప్లాన్ వైపు అడుగులు వేశారు. తమ భూములు పోతున్నాయంటూ రైతుల నుంచి స్థానిక నేతలపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎన్నికల వేళా ఎందుకు తలనొప్పి అనే ఆలోచనలతో అధికార పార్టీ దిగివచ్చింది. శుక్రవారం జగిత్యాల, కామారెడ్డి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని మాస్టర్ ప్లాన్ ముసాయిదా, డ్రాఫ్ట్‌ను రద్దు చేుస్తూ తీర్మానం చేపించి ఆమోదింప జేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలన్న తీర్మానంపై చర్చ నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశంలో వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్‌ను కొందరు కౌన్సిలర్లు నిలదీశారు. మాస్టర్ ప్లాన్‌ను మీరే రూపొందించి, మీరే ఎలా రద్దు చేస్తారని వాదనలు వినిపించారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని వివరించారు.
Recent Comments