మళ్లీ నిబంధన
మాస్క్ మస్ట్ లేదంటే 1000ఫైన్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంటోంది. రోజురోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తూ మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు మాస్కు తప్పక ధరించాలని.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Recent Comments