Thursday, November 14, 2024
Homeజాతీయం36 మంది మావోయిస్టులు హతం..

36 మంది మావోయిస్టులు హతం..

మావోలకు భారీ దెబ్బ..
ఇప్పటి వరకు 170మందికి పైగా…
స్పాట్ వాయిస్, బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో తుపాకీలు నెత్తురుపారించాయి. నారాయణ్‌పుర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎదురుకాల్పుల్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కు చేరినట్లు పోలీసులు వెల్లడించారు. బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మాడ్‌ దండకారణ్యంలోని తుల్‌తులి, నెందూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎదురు కాల్పులు జరిగిటన్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ మీడియాకు తెలిపారు. అక్కడ మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
బస్తర్‌ ప్రాంతంలో 170 మందికి పైగా..!
ఎన్‌కౌంటర్‌ అనంతరం 30 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్‌, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో అడపాదడపా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్‌ ప్రాంతంలో 170 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments