ధృవీకరిస్తూ జగన్ పేరిట లేఖ
బడే చొక్కా రావుపై రూ.50 లక్షల రివార్డ్
తెలంగాణ స్టేట్ సెక్రటరీగా, మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల ఇన్‌ఛార్జ్‌గా విధులు
స్పాట్ వాయిస్, బ్యూరో : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మరణించారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మరణించాడు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్లో మృతి చెందిన దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. ఆయన చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలో చేరిన అంచెలంచెలుగా ఎదిగారు. 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న దామోదర్ మావోయిస్టు యాక్షన్ టీమ్‌ల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆయన మావోయిస్టు స్టేట్ సెక్రటరీగా నియమితులయ్యారు. దామోదర్‌పై తెలంగాణలో రూ.25 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షలు రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.
Recent Comments