మానుకోట కు ఢిల్లీ లింక్..
ఇద్దరు వ్యాపారులను ప్రశ్నించిన ఈడీ
కీలక ప్రజాప్రతినిధితో సంబంధాలు..!
స్పాట్ వాయిస్ , ఓరుగల్లు: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టుచేయగా ఈడీ పలుసార్లు తనిఖీలు చేసింది. కేసుతో సంబంధం ఉందని భావించిన వారికి నోటీసులిచ్చి విచారిస్తున్నారు. మద్యం ముడుపుల వ్యవహారం చిన్నదే అయినా ఈడీ దర్యాప్తులో అనేక డొల్ల కంపెనీల బాగోతం వెలుగులో కి వచ్చింది. డొల్లకంపెనీలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీలకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్దమొత్తంలో వివరాలు సేకరించింది. ఆ సమాచారం ఆధారంగానే కేసు మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేస్తోంది.
ఖాతాలో రూ.50కోట్లు
కొందరు డ్రైవర్లను బినామీలుగా పెట్టుకొని, వారి ఖాతాల్లో డబ్బు జమచేసి, మళ్లీ అక్కడ నుంచి వేరేఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడినట్లు తెలిసిందే. గురువారం మహబూబాబాద్‌లో ఇద్దరి ఇంటికెళ్లి అధికారులు ప్రశ్నించారు. అంతకుముందే సేకరించిన ఆధారాలను చూపించి వారిని ప్రశ్నించారు. అందులో ఒకరు కీలక ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉండేవాడని అతని ఖాతా ద్వారా 50 కోట్ల వరకూ లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. అలానే ఆ వ్యక్తికి డ్రైవర్‌గా వ్యవహరించే మరో వ్యక్తిని ప్రశ్నించారు. అతని ఖాతా ద్వారా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించిందని సమాచారం. సదురం వ్యాపారి ఎన్నికల సమయంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు డబ్బులు ముట్టజెబుతాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recent Comments