గోత్తి కోయలకు పోలీసుల చేయూత
-అపరిచితులకు ఆశ్రయం ఇవ్వద్దు
-ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
స్పాట్ వాయిస్, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని అడవిలో నివాసం ఉంటున్న వలస గుత్తి కోయ గ్రామాలను ఆదివారం ఏటూరునగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సందర్శించారు. ఈ సందర్భ oగా సీజే ఐ (కెనడా) సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన ఐటీ ఎంప్లాయీస్ చెందిన రాబిన్ హుడ్ ఎన్ జీవో, పోలీసులు సంయుక్తంగా వలస గుత్తి కోయ ఆరు గ్రామాలు ముసలమ్మ గుట్ట, ప్రాజెక్ట్ నగర్, శాంతినగర్, కేశవపురం, పాలాయగూడె, రాళ్లగుంపు, ఎస్టీ కాలనీకి చెందిన 162 కుటుంబాలకు సోలార్ లైట్లు, నిత్యవసర వస్తువులు , దుస్తులు రాబిన్ హుడ్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ తో కలిసి ఏటూరునగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అందజేశారు. ఈ సందర్బoగా శివం ఉపాధ్యాయ గోత్తి కోయలతో మాట్లాడుతూ..గ్రామాల్లోని అపరిచితులు, మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వకూడదని, మీకు ఎటువంటి సాయంకావాలన్నా పోలీస్ లను ఆశ్రయించాలన్నారు. మిర్చి కూలీల ముసుగులో మావోయిస్టులు గ్రామాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ లకు ముందే తెలియజేయాలని హెచ్చరించారు. ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నగరం సీఐ శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీ వీ ఆర్ సూరి,సురేష్, రాబిన్ హుడ్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ ట్రైనీ ఎస్సై లు మహేష్, శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments