Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్మల్లు స్వరాజ్యం కన్నుమూత

మల్లు స్వరాజ్యం కన్నుమూత

స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె.. మార్చి 2న కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రావడంతో సీపీఎం నేత బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాస్పిటల్‌ కు వెళ్లి చూశారు. అయితే వెంటిలేటర్ పై ఉన్న ఆమె రాత్రి తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ఎంబీ భవన్‌కు తరలించనున్నారు. 13 ఏళ్ల వయస్సులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం.. తుపాకీ పట్టిన మొదటి మహిళగా పేరుతెచ్చుకున్నారు. ఆమె తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె మృతి చెందిన విషయం తెలియడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments