Monday, November 25, 2024
Homeతెలంగాణపోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..

పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..

పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..
స్పాట్ వాయిస్, బ్యూరో: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తాను కొనుగోలు చేసిన భూమిని మరొకరు ఆక్రమించారని మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి ఉండటంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూవివాదం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరికొంత మంది స్థానికుల మధ్య ఈ వివాదం నడుస్తోంది. సర్వే నెంబర్‌ 82లోని రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం వివాదస్పద స్థలం వద్దకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. స్థలంలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెను అనుచరులతో కలిసి కూల్చేశారు. దీనిపై సదరు 15 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్డి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మల్లారెడ్డి వినిపించుకోకపోవడంతో ఆయన్ను, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని స్టేషన్‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments