Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్మార్పు మంచికేనా..?

మార్పు మంచికేనా..?

తీన్మార్ మల్లన్న… గులాబీ వైపా..!
ఇగ కేసీఆర్ ను తిట్ట..
మల్లన్న సంచలన వ్యాఖ్యలు
మాటల్లోని మర్మం ఎంటి..?
ఇటీవలే బీజేపీకి దూరం..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ర్టంలో దుమారం రేపుతున్నాయి. నిన్నటి వరకూ కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని బండ బూతులు తిడుతూ.. ప్రతీ పనిని విమర్శించే తీన్మార్ మల్లన్న ఒక్కసారిగా కేసీఆర్ ను ఇక తిట్టనని అనడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్‌’ సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒట్టేసి చెబుతున్న.. ఇక నుంచి కేసీఆర్‌ను ఒక్క మాట కూడా తిట్టను. ‘7200 మూవ్‌మెంట్‌’ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం చేస్తా’ నంటూ తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయడం తమ విధానం కాదని, ప్రజా చైతన్యానికే తమ పోరాటమని చెబుతున్నారు. విద్యావంతులైన బాల్క సుమన్‌, గాదరి కిషోర్‌లకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుందని చెబుతున్న ఆయన.. జూన్‌ రెండో వారంలో చేపట్టే ప్రజాపాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
మారిపోయాడా..?
తీన్మార్ మల్లన్న అంటే ప్రభుత్వంపై ఫైర్ అయ్యే వ్యక్తి. కేసీఆర్ కుటుంబంపై నిప్పులు కక్కే వాడని అందరికీ తెలుసు. అయితే ఇటీవల ఆయనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. కేసుల సమయంలో బీజేపీలో చేరిన మల్లన్న కొద్దికొద్దిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ‘7200 మూవ్‌మెంట్‌’ అంటూ కొత్త ఊపును తీసుకొస్తున్నారు. వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు..బీజేపీ వీడుతున్నారనే సంకేతాలను వెల్లడించారు. తాజాగా తాను కేసీఆర్ ను తిట్టనంటూ ఒట్టు వేసుకున్నాడు. ఇంతకి తీన్మార్ మల్లన్న లో వచ్చిన మార్పునకు కారణం ఎంటి..? అనేది అంతుచిక్కడం లేదు. గులాబీ వలలో పడ్డాడా..? లేక ఎన్నికల కాంట్రావర్సి ఎందుకు అనుకుంటున్నారా..? అనే విషయం తేలాల్సి ఉంది. అయితే మలన్నలో మార్పు మంచికేనని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments