Monday, April 7, 2025
Homeజిల్లా వార్తలుదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు సురక్షా దివాస్..

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు సురక్షా దివాస్..

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు సురక్షా దివాస్

కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్

స్పాట్ వాయిస్, మల్హర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సూరక్షా దివాస్ ని పోలీస్ శాఖ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు కొయ్యూరు ఎస్సై వడ్ల కొండ నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ న సురక్షా దివాస్ నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, స్నేహపూర్వక విధానాన్ని, సమర్థవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు శాఖలో జరిగిన సంస్కరణలను వాటి విశిష్టతలను సభల ద్వారా, కరపత్రాల ద్వారా తెలియపరచనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఉదయం జిల్లా కేంద్రంలో పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోల్ట్స్,ఫైర్ వెహికిల్స్ తో ర్యాలీ ఉంటుంది అని , సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బందితో సభలు నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రం లో బడా ఖాన చేయనున్నట్లు తెలిపారు. కావున అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొయ్యూరు ఎస్సై నరేష్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments