కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి ఇనగాల వెంకట్రాం రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: రైతులందరూ గ్రామ సభలో భూములు ఇవ్వమని తీర్మానం చేయాలని పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఇనగాల వెంకట్రాం రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోతున్న రైతులకు బాసటగా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఇనగాల వెంకట్రాం రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ బొల్లికుంట గ్రామంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులందరూ వారివారి గ్రామాల్లో తప్పనిసరిగా గ్రామ సభలను ఏర్పాటు చేసుకొని భూములు ఇచ్చేది లేదని వారి పేర్లు, సర్వే నంబర్లు, సంతకాలతో కూడిన వివరాలను పూర్తిగా రాసి తీర్మానాలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందన్నారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభలో చేసిన తీర్మానాలతో హైకోర్టులో మీ తరఫున పోరాడతామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ మెంబర్ షిప్ కో-ఆర్డినేటర్ బొమ్మనపెల్లి అశోక్ రెడ్డి, 17 వ డివిజన్ అధ్యక్షుడు పసునూరి వేణుగోపాల్, ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు జేఏసీ కన్వీనర్ సోల్తి కిరణ్ గౌడ్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భూములివ్వమని తీర్మానం చేయండి
RELATED ARTICLES
Recent Comments