Tuesday, December 3, 2024
Homeసినిమామెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు మృతి..

మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు మృతి..

స్పాట్ వాయిస్, డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమసల్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లంగ్స్‌ డ్యామేజ్ తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు తెలిసింది. శిరీష్‌ మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, శిరీష్ భరద్వాజ్.. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప నివ్రతి ఉంది. ఆ తర్వాత శిరీష్‌ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక శిరీష్‌తో విడిపోయిన అనంతరం హీరో కల్యాణ్‌ దేవ్‌ను శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూడా నవిష్క అనే పాప ఉంది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments