ఎంఐఎం చేతిలో కారు స్టీరింగ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
తుక్కుగూడలో బహిరంగ సభ
స్పాట్ వాయిస్, రంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణ నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. రజాకార్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకే సంజయ్ యాత్ర చేపట్టారని స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగసభలో అమిత్షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా..? అని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎష్ పార్టీలు అవిభక్త కవలలన్నారు. కారు స్టీరింగ్… ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్షా పిలుపునిచ్చారు. ఇంత అవనీతి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదని, రెండు పడక గదుల ఇళ్లను కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాని ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదని, పేదలకు రూ.5 లక్షల వైద్యం సహాయం అందే పథకాన్ని నిలిపివేశారని చెప్పారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదని, హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్ పూర్తిచేస్తారన్నారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని ఈ ప్రభుత్వం జరపడం లేదని ఆరోపించారు. బండి సంజయ్ 45 డిగ్రీల ఎండలో 660 కి.మీ. నడిచారని చెప్పారు.
నిజాం ప్రభువును గద్దె దించాలి
RELATED ARTICLES
Recent Comments