రిజిస్ట్రార్ ను కలిసి గోడు వెల్లబోసుకున్న స్టూడెంట్స్
స్పాట్ వాయిస్, కేయూ : కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్ డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పమైంది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శుక్రవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల హాస్టళ్లకు అధికారులు తాళాలు వేశారు. ఈ క్రమంలో విద్యార్థులు యూనివర్సిటీ వీసీ ని కలిసేందుకు వెళ్లగా అక్కడ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ ను కలిసి తాళాలు తీయాలని కోరారు. విద్యార్థులు మాట్లాడుతూ కొత్తగా అడ్మిషన్లు పొందిన వారికి కార్డు ఇవ్వకుండా పాత విద్యార్థులకు మెస్ కార్డులు రెన్యూవల్ ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. కరోనా కారణంగా తమ పరిశోధన ఆలస్యం అయ్యిందని విన్నవించుకున్నా వీసీ, రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదని స్కాలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేయూ స్కాలర్స్ హాస్టల్‌కు తాళాలు..
RELATED ARTICLES
Recent Comments