స్థానిక సమరంపై పొంగులేటి ప్రకటన
ఫస్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట మరోసారి మొదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటీ చేసే ఆశావహులు ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఆశగా చూస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలో పలువురు మంత్రులు కూడా చెప్పారు. అయితే తాజాగా.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ చివరి వారంలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
Recent Comments