క్లారిటీ ఇచ్చిన సీఎం
స్పాట్ వాయిస్,బ్యూరో: రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టామని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో మంగళవారం తెలంగాణ సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతీ కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందన్న వ్యవసాయ శాఖ, 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 వరకు లోన్లు తీసుకున్న వారంతా అర్హులని స్పష్టం చేసింది.
Recent Comments