ఖానాపురం మండల కేంద్రంలో ఘటన
ఊలుకు పలుకు లేని ఎక్సైజ్ అధికారులు..
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
వార్తలు రాస్తే విలేకరిపై బెదిరింపులు..
స్పాట్ వాయిస్ (నర్సంపేట), ఖానాపురం: బీర్ బాటిల్లో బల్లి అవశేషాలు కనిపించిన ఘటన ఖానాపురంలో గురువారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మంగళవారిపేట గ్రామానికి చెందిన గోపగాని శ్రీమన్నారాయణ తనమిత్రుడితో కలిసి మండల కేంద్రంలోని మద్యం దుకాణానికి వెళ్లారు. రెండు బీర్లు తీసుకుని తాగుతుండగా ఒక బీర్‌లో బల్లి అవశేషాలు కనిపించాయన్నాడు. కంగుతిన్న బాధితుడు వెంటనే మద్యం దుకాణం యజమానికి విషయాన్ని తెలుపగా విషయాన్ని తేలికగా తీసుకున్న దుకాణదారులు ఇదంతా సర్వ సాధారణమని తెలిపారని బాధితుడు తెలిపాడు.
పత్తాలేని అధికారులు..
కొద్ది రోజులుగా ఖానాపురం మండలంలోని మద్యం దుకాణాలలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఎన్ని వార్తలు వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం స్పందించిన పాపానపోవడంలేదు. అధికారులకు ఫోన్ లో పిర్యాదు చేద్దామన్నా స్పందించే పరిస్థితి లేదు.
వార్తలు రాస్తే బెదిరింపులు..
వైన్ షాప్ లపై వార్తలు రాసే విలేకరులకు సిండికేట్ దారులు బెదిరింపులకు దిగుతున్నారు. బీరు బాటిల్లో బల్లి అవశేషాలు వచ్చాయంటూ వార్త రాసిని స్పాట్ వాయిస్ విలేకరికి సదురు వైన్స్ షాప్ బాధ్యుడు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. మద్యం షాప్ లపై వార్తలు ఎలా రాస్తారని, పోలీస్ కేసులు పెడతామని బెదిరింపులకు దిగాడు.
Recent Comments