ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట : జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ కలిసి మెలిసి ఉండాలని, సమైక్యతా భావంతో జీవించాలనే సంకల్పంతో ఆనాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు. భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ చూపెట్టే శ్రద్దకు, గౌరవానికి ప్రతీకగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకోవడం శుభపరిణామన్నారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణను సాదించామో ఆ లక్ష్యాల సాధనలో ఈ రోజు భారతదేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments