Wednesday, March 12, 2025
Homeలేటెస్ట్ న్యూస్అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు..

అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు..

అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు..
2019లో ఘటన.. నేడు తీర్పు..
స్పాట్ వాయిస్, కాటారం: అన్నను హత్యచేసిన తమ్ముడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మారుపాక అశోక్, నాగరాజు అన్నదమ్ములు. వీరికి వారి స్వగ్రామంలో ఇంటిస్థలం ఉండగా అశోక్ అతడి అన్న మారుపాక నాగరాజు, వీరి తల్లి మారుపాక శంకరమ్మ సమానంగా పంచుకున్నారు. సదురు స్థలంలో తన వాటాకు వచ్చిన స్థలంలో మృతుడు మారుపాక నాగరాజు చిన్న ఇల్లు నిర్మించుకున్నాడు. నిందితుడు మారుపాక అశోక్ తాగుడుకు అలవాటుపడి తన వాటాకు వచ్చిన భూమిని అమ్ముకొని ఖర్చు చేసుకున్నాడు. అప్పటి నుంచి అశోక్ తన అన్నను అతను కట్టుకున్న ఇంటిలో వాటా వస్తుందని ఇబ్బందులకు గురిచేస్తూ చంపుతానని బెదిరిస్తూ వస్తున్నాడు. దీంతో నాగరాజు గ్రామం నుంచి కుటుంబంతో సహా వెళ్ళిపోయి వేరే గ్రామంలో బతుకుతున్నారు. 2019 మే నెలలో 10వ తేదీన ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి తన నాగరాజు గంగారం రాగా నిందితుడు ఇంటి స్థలం విషయంలో గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఖాళీ బీరు బాటిల్ పగులగొట్టి తన అన్న గొంతులో పొడవగా మృతి చెందాడు. మృతుడి భార్య మారుపాక సరిత ఫిర్యాదు మేరకు అప్పటి కాటారం ఎస్ హెచ్ఓగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ మహేందర్ నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు. అప్పటి కాటారం సీఐ శివప్రసాద్ నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం సీఐగా వచ్చిన హతీరామ్ దర్యాప్తు పూర్తి చేసి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కోర్ట్ లైజన్ ఆఫీసర్ ఏఎస్సై గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు కే. రమేష్ , కే వినోద్ సాక్షులను సరైన సమయంలో కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణబాబు నిందితుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి, కాటారం సీఐ నాగార్జున రావు, కాటారం ఎస్సై అభినవ్, అప్పటి దర్యాప్తు అధికారులను భూపాలపల్లి ఎస్సీ కిరణ్ ఖరే అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments