– జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్
స్పాట్ వాయిస్, గణపురం: నిరుద్యోగ యువత కోసం గ్రంధాలయాలలో పోటీ పరీక్షలకు కు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలపై ఆరా తీశారు. ఇంకా ఏఏ గ్రంథాలు ఎన్ని కావాలని గ్రంథాల యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకానికై నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో గ్రందాలయాలలో పోటీ పరీక్షకు సంబంధించిన వివిధ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పేద మధ్యతరగతి నిరుద్యోగ యువతకు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు ఇవి ఎంతగానో దోహద పడతాయన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత గ్రంథాలయాలలో ఇంకా ఏమైనా స్టడీ మెటీరియల్ కావలసి వస్తే సూచించవలసిందిగా వారు తెలిపారు. నియోజకవర్గంలో పోటీ పరీక్షలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు తోడ్పాటును అందిస్తన్నారని తెలిపారు. ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
Recent Comments