జూనియర్ సివిల్ జడ్జి ముదిగొండ రాజు
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని పులుకుర్తి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఇబ్రహీం పట్నం జూనియర్ సివిల్ జడ్జి ముదిగొండ రాజు,హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందు శ్రీలత అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని పులుకుర్తిలో గ్రామానికి చెందిన ఉద్యోగస్తులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీం పట్నం జూనియర్ సివిల్ జడ్జి ముదిగొండ రాజు మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందు శ్రీలత మాట్లాడుతూ.. తాము ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చామని, ఎక్కడ చదువుకున్నమన్నది ముఖ్యం కాదని, ఎంత నేర్చుకున్నాం అనేది ముఖ్యమన్నారు.
సమష్టిగా మన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని సూచించారు. ఎల్బీ కాలేజీ ఎన్ సీసీ అధికారి డాక్టర్ సదానందం మాట్లాడుతూ.. యువత పదో తరగతి తరువాత ఆర్మీ, నేవీ, పోలీస్ రంగాల్లో చేరాలని ఆయన సూచించారు. దామెర ఎస్సై హరిప్రియ మాట్లాడుతూ.. యువకులతో పాటు తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలననారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. ఎమార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, జాతీయ అధికార ప్రతినిధి బొర్రా భిక్షపతి మాదిగతో పాటు, వివిధ రంగాల్లో స్థిరపడిన ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయసుధ, ఎండీ ఫిజిషియన్ డా.సామెల్, సర్పంచ్ అశోక్, డా.సంపత్ రెడ్డి, మురళి,తదితరులు పాల్గొన్నారు.
Recent Comments