Saturday, November 23, 2024
Homeటాప్ స్టోరీస్మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు..

మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు..

క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు..!
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సీతక్క నోటీసులు పంపించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్‌ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేర నష్ట పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని సీతక్క ఆరోపించారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో.. ఇసుకాసుర రాజ్యం’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, సీతక్కతో పాటు పలువురు మంత్రులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా సివిల్, క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. జూన్‌ 24న బీఆర్‌ఎస్‌ అధికారిక సోషల్‌ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్‌ నోటీసులు పంపించినట్టు సీతక్క తరఫు న్యాయవాది కృష్ణకుమార్‌ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments