Friday, November 22, 2024
Homeజనరల్ న్యూస్ఏడేడు సార్లు.. మూడేసి ముళ్లు...

ఏడేడు సార్లు.. మూడేసి ముళ్లు…

స్పాట్ వాయిస్, డెస్క్:  పెళ్లంటే మూడు ముళ్లు.., ఏడడుగులు.. అవే మూడు ముళ్లు, ఏడడుగులు ఏడేడు సార్లు వేసి అవ్వురా అనిపించింది ఈ మాయలేడి. ఆ మజాయే వేరనుకుందో ఏమో గానీ ఒకరి తర్వాత ఒకరు ఏడుగురిని పెళ్లి చేసుకుని, కేవలం మూడు నెలల్లో ఈ ఘన కార్యం సాధించి రికార్డు క్రియేట్ చేసింది హర్యానాకు చెందిన నారిమణి.. సంపాదనకు షార్ట్ కట్ షాదీ అని అదే సూత్రాన్ని ఇంప్లీమెంట్ చేసి చివరకు పోలీసులకు చిక్కి విస్తు గొలిపే విషయాలు చెప్పింది. వివరాలిలా ఉన్నాయి…

హర్యానాలో ఓ నిత్య పెళ్లికూతురు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్టు వెల్లడైంది. ఆమెకు గతంలోనే తొలి వివాహం జరగ్గా, మోసాల బాటపట్టిన ఆమె విడాకులు తీసుకున్నవారు, పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని వంచనకు పాల్పడుతూ మరో రెండు పెళ్లిళ్లు చేసుకుంది. అవీ చాలావన్నట్టు నాలుగో వివాహం రాజేందర్ అనే వ్యక్తితో జరిగింది. అనుమానం వచ్చిన అతను ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువతిని, ఆమెకు సహకరిస్తున్న మరికొందరిని అరెస్ట్ చేశారు.
విచారణలో ఆమె అన్ని విషయాలు వెల్లడించింది. ఖేదీ కరమ్ షామ్లి ప్రాంతానికి చెందిన సతీశ్ ను మొదటి వివాహం చేసుకున్న ఆ కిలాడీ భామ, అక్కడి నుంచి తన నిత్య కల్యాణానికి తెరలేపింది. ఈ ఏడాది జనవరి 1న రాజస్థాన్ లో రెండో వివాహం, ఫిబ్రవరి 15న మూడో వివాహం, మరో 6 రోజుల తేడాతో రాజేందర్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. ఇక, కుటానా ప్రాంతానికి చెందిన గౌరవ్ ను ఐదో పెళ్లి చేసుకున్న మాయలాడి… కర్నాలకు చెందిన సందీప్ తో ఆరో వివాహం, మార్చి 26న బుద్వా ప్రాంతానికి చెందిన సుమిత్ ను ఏడో వివాహం చేసుకుంది. దీనిపై వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు ఎవరూ లేరని ఆమె నమ్మించేదని, తన వలలో ఎవరైనా పడితే వారిని పెళ్లి వరకు తీసుకువచ్చేదని తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు ముఠా సభ్యులు సహాయసహకారాలు అందించేవారు. మొదటి రాత్రే తన పన్నాగం అమలు చేసేది. శోభనం రాత్రే భర్తకు మత్తుమందు ఇచ్చి, అతడు స్పృహకోల్పోయాక డబ్బు, నగలతో పరారయ్యేది. ఖిలాడి భామ బాగోతం భలే బాగుంది కదూ…!

RELATED ARTICLES

Most Popular

Recent Comments