Saturday, April 5, 2025
Homeరాజకీయంమంత్రి హరీష్ కు ల్యాండ్ పూలింగ్ సెగ

మంత్రి హరీష్ కు ల్యాండ్ పూలింగ్ సెగ

వర్ధన్నపేట నియోజకవర్గంలో రైతుల ధర్నా..
పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు..
ఎమ్మెల్యే అరూరి రమేష్ పైనా అన్నదాతల ఆగ్రహం

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ఎంతటివారికైనా తప్పదంటే ఇదేనేమో. రెండు రోజుల పర్యటనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన మంత్రి హరీష్ రావుకూ వర్ధన్నపేట నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. జిల్లా మొత్తంగా అంటుకున్న ల్యాండ్ పూలింగ్ మంటల సెగ ఇప్పుడు మంత్రి వరకూ చేరింది. తమ భూములను లాక్కోవడానికి సర్కార్ తెగింపు సరికాదని రైతులు భీష్మించారు. పచ్చని పంటపొలాలకు చిచ్చుపెట్టి, పండంటి జీవితాల్లో మంటలు రేపుతున్న టీఆర్ఎస్ సర్కార్ చర్యలను రైతులు దుయ్యబట్టారు. న్యాయంగా తమ భూములను తమకే వదిలేసి, రెవెన్యూ పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచించారు. మంత్రి హరీశ్ రావు పర్యటనను అడ్డుకునేందుకు రోడ్లపై రైతులు ధర్నా చేశారు. పున్నెల్ క్రాస్ వద్ద వరంగల్ ఖమ్మం హైవే పై పెద్ద సంఖ్యలు గుమిగూడి దారికడ్డంగా నిలుచున్నారు. తెలంగాణ సర్కార్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. రైతులతో పెట్టుకున్న ఏ సర్కార్ బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవని శాపాలు పెట్టారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ కు వ్యతిరేకంగా, తెలంగాణ సర్కార్ ఒంటెత్తు పోకడలను దుయ్యబడుతూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పర్యటనకు అడుగడుగునా అడ్డంకులే సృష్టించే ప్రయత్నం చేయడంతో ఇబ్బందికర పరిస్థితే నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments