Saturday, November 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్యాసిడ్ కలిసిన నీటిని తాగిన కూలీలు

యాసిడ్ కలిసిన నీటిని తాగిన కూలీలు

తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ముగ్గురి పరిస్థితి విషమం..
స్పాట్ వాయిస్, ములుగు: మంచినీళ్లు అనుకొని డ్రిప్ క్లీనింగ్ యాసిడ్ మిర్చి కూలీలు తాగారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. గొల్లగూడెం గ్రామంలో మిర్చి ఏరుతున్న కూలీలు సుమారు 25 మంది మధ్యాహ్నం భోజనం చేసేందుకు పక్క మిర్చి చేనులోని తాగు నీరు తెచ్చుకున్నారు. భోజనం చేస్తూ నీళ్లు తాగడంతో.. వాంతులు మొదలయ్యారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కలుషిత నీరు(డ్రిప్ క్లీనింగ్ యాసిడ్) తాగడంతో రైతులు వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. మిర్చి తోటలో డ్రిప్ క్లీనింగ్ చేసేందుకు పాస్పరస్ ఆమ్లం కలిపిన నీరు తాగటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు సైతం గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments