Friday, May 2, 2025
Homeజిల్లా వార్తలుమెస్ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వాలి

మెస్ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వాలి

డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి
స్పాట్ వాయిస్, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో భోజనం చేయని వారికి మెస్ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో భోజనం చేయని విద్యార్థులకు, సెలవుల్లో మెస్ బిల్లు మినహాయించాలని కోరుతూ కేయూ పరిపాలన భవన్ లో రిజిస్టర్ ప్రొఫెసర్ వి.రామచంద్రం కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో మొదటి సంవత్సరం విద్యార్థులకు సెలవులు ప్రకటించిన సందర్భంగా, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పటికీ, కామన్ మెస్ లో కొంతమంది విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పించి, అదే మెస్ బిల్లును అందరి విద్యార్థుల మీద వేయకూడదని, భోజనం చేసిన వారి నుంచే మెస్ బిల్లులు వసూలు చేయాలని అన్నారు. భోజనం చేయని వారి మీద భారం వేయకూడదని, గత సంవత్సరం వేసవిలో ఇదే పరిస్థితి కొనసాగిందని, దాంతో విద్యార్థులు బిల్లుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనబడుతుందని, కామన్ మెస్ లో భోజనం చేసిన వారికే మెస్ బిల్లు వేసి, మిగతా వారిని మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సాగర్, సాయి గణేష్, యం.శ్రీ సాయి, ఎన్. ప్రవీణ్, ధనరాజ్, ఎస్.గణేష్, పి. యుగేందర్, వినయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments