అబ్బో.. దొంగ తెలివి..
మున్సిపాలిటీ ఉద్యోగుల మంటూ.. చోరీ
లబోదిబోమంటున్న బాధితులు..
స్పాట్ వాయిస్, క్రైం: దొంగలు రోజురోజుకు తెలివి మీరిపోతున్నారు. ప్రజలను మోసం చేసే నమ్మించేందుకు.. మోసం చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తాము ఫలానా కంపెనీ నుంచి వచ్చామని , సేల్స్ అంటూ బురిడీ కొట్టించే వారు. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ ఉద్యోగులమని చోరీలకు దిగుతున్నారు. హనుమకొండ జిల్లాలో బుధవారం ఉదయం కొంత మంది దుండగులు ఈ తరహా మోసానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే..
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురం శ్రీనివాస కాలనీ రోడ్ నెంబర్ 2 లో నివాసం ఉంటున్న చినూరి రాంబాబు ఇంటికి బుధవారం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మున్సిపాలిటీ ఉద్యోగులమని, సెప్టిక్ ట్యాంక్ తనిఖీ చేసి కొలతలు తీసుకోవడానికి వచ్చామని రాంబాబు కుటుంబ సభ్యులకు చెప్పారు. వారిని నమ్మించి ముగ్గురు వ్యక్తులు రాంబాబు ఇంట్లో చొరబడ్డారు. 20 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వారు వెళ్లాక జరిగింది చూసి రాంబాబు కుటుంబ సభ్యులు షాకయ్యారు. దీంతో వారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments