పూలకుండీలు, కిటీకి అద్దాలు ధ్వంసం
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకుని వీసీ చాంబర్ వరకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను పోలీసులు ఈడ్చి పడేశారు. దీంతో యూనివర్సిటీ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద విద్యార్థులు కిటికీల అద్దాలు, పూల కుండీలు పగులగొడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వీసీ బిల్డింగ్ పైకి ఎక్కి ఇద్దరు స్టూడెంట్స్ నిరసన తెలిపారు. బలవంతంగా వారిని పోలీసులు కిందికి దించారు. అంతకుముందు పెట్రోల్ తో టైర్లు కాలబెట్టే ప్రయత్నం చేయగా.. సీఐ దయాకర్ వారిని అడ్డుకున్నారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు తమను అడ్డుకోని ఇబ్బంది పెట్టారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments