Monday, November 25, 2024
Homeక్రైమ్ఓర్నీ దొంగతెలివి..

ఓర్నీ దొంగతెలివి..

గిట్టుబాటు కాలేదని ఉంటే.. జైలుపాలయ్యారు..
కేటీఆర్ సభే టార్గెట్ గా హైదరాబాద్ ముఠా
నగరంలోనే అడ్డా..
దొంగతనాలకు పాల్పడుతూ చిక్కిన వైనం..
అరెస్ట్ చూపిన పోలీసులు
స్పాట్ వాయిస్, క్రైమ్ : ‘‘మంత్రి కేటీఆర్ ప్రోగ్రాం. కార్యక్రమానికి మస్తు జనం వస్తారు.., ఎటు చూసినా జేబులే జేబులు.., డబ్బులే డబ్బులు. కోడ్తే.. లైఫ్ కనీసంగానైనా కొద్ది నెలలు సెటిల్ అవుతుంది..’’ ఇది ఆ ముఠా ఆలోచన. ‘‘పని మీద వచ్చాం.. ప్రయత్నం చేశాం.. కానీ ఫలితం ఆశాజనకంగా లేక నిరాశ చెందాం. ఎలాగూ వచ్చాము.., చెడ్డాము.., ఉత్త చేతులతో వెనక్కి వెళ్లేలే లేదు..’’ ఇది అదే ముఠా శపథం. ఈ సారి ప్రయత్నాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అడ్డాలు వెతుకున్నారు.., ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా బుక్కయ్యారు. బుధవారం సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి పోలీసులు ఆ దొంగ ముఠా అరెస్ట్ ను చూపారు. వివరాలు సీపీ తరుణ్ జోషి కథనం ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన హతగాడే రవి, హతగాడే మహేష్, కమ్లే బాబు అలియాస్ఉప్పాడే అనిల్, ఎస్కే కైసర్ పాషా అలియాస్ మొహమ్మద్ కైసర్, సచిన్ ప్రకాష్ ఉపాధ్యాయ, పల్లెల సురేష్ ఈ నెల 20వ తేదీన వరంగల్ కు వచ్చారు. మంత్రి కేటీఆర్ సభలే లక్ష్యంగా దొంగతనాలకు నిర్ణయించుకున్నారు. రెండు బృందాలుగా విడిపోయి మంత్రి కేటీఆర్ సభే టార్గెట్ గా చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే హయగ్రీవాచారి మైదానంలో జరిగిన మంత్రి సభలో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేల నగదు.., అలాగే, గ్రేటర్ పరిధిలో జరిగిన మంత్రి ప్రోగ్రామ్ లో ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు కొట్టేశారు. వారు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోవడంతో నిరాశ చెందారు. ఇక్కడే రాబట్టుకోవాలని నగరంలోనే మకాం వేశారు. రద్దీ ప్రాంతాలైన హన్మకొండ, వరంగల్ బస్టాండ్లు, తదితర ప్రాంతాలను టార్గెట్ గా చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారు సుబేదారి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్న పోలీసులు విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అడిషనల్ డీసీపీ కే.పుష్ప, క్రైమ్ ఏసీపీ పి.డేవిడ్ రాజు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ ఎల్. రమేష్ కుమార్, ఎస్సైలు సంపత్ కుమార్, యాదగిరి, ఏఎస్సైలు కె.శివకుమార్, పి.శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు రవికుమార్, వి.జంపయ్య, జి. అంజయ్య, సీహెచ్. వేణు గోపాల్, నజీరుద్దిన్ తదితరులను పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments