Saturday, April 19, 2025
Homeతెలంగాణఅక్కరకురానోళ్ల బొమ్మలు తీసేసుడే..

అక్కరకురానోళ్ల బొమ్మలు తీసేసుడే..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
స్పాట్ వాయిస్, బ్యూరో: సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్‌ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అంటూ సీఎం రేవంత్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యి ఇప్పుడు రాజీవ్‌గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని ఘాటు కామెంట్స్ చేశారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అక్కరకురాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని, తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో అని రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments