Saturday, November 23, 2024
Homeతెలంగాణజై తెలంగాణ.. అంటే కొడుతరా..? 

జై తెలంగాణ.. అంటే కొడుతరా..? 

జై తెలంగాణ అంటే కొడుతరా..?

పోలీసుల తీరుపై మండిపాటు..

సీపీ అంబ‌ర్ కిశోర్ ఝాతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్

గాయపడిన కార్యకర్తలను పరామర్శ 

కార్యకర్తలు అధైర్యపడొద్దని భరోసా 

స్పాట్ వాయిస్, దామెర: బీఆర్ఎస్ నాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్రంపహాడ్ జాతర ఘటనలో పోలీసులు కొట్టిన కార్యకర్తలను శుక్రవారం మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా గుడెప్పాడ్ వద్ద ఉన్న ఎన్ ఎస్సార్ హోటల్ లో పరామర్శించారు. జై తెలంగాణ అంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. వరంగల్ సీపీ అంబ‌ర్ కిశోర్ ఝాతో ఫోన్‌లో మాట్లాడారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన పార్టీ మనదని గుర్తుచేశారు. స్థానిక పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినా, పార్టీ కార్యకర్తలపైన పోలీసుల దమనకాండ ఆగడం లేదని ఈ సందర్భంగా పరకాల నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పరకాలలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఢిల్లీ వరకు వెళతామని, న్యాయస్థానాలతోపాటు మానవహక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. పరకాల వంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ పునరావృతమైనా పార్టీ యంత్రాంగం చూస్తూ ఊరుకోబోదమని కేటీఆర్ స్పష్టంచేశారు. దాడులకు భయపడకుండా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండ కట్టాలని వారిలో ధైర్యం నింపారు. కార్యక్రమంలో పోలీసుల చేతిలో తీవ్ర గాయాల పాలైన దామెర వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, కాంతాల కేశవరెడ్డి, నేరెళ్ల కమలాకర్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments