Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలుగణపురంలో మంత్రి కేటీఆర్‌ బర్త్ డే వేడుకలు

గణపురంలో మంత్రి కేటీఆర్‌ బర్త్ డే వేడుకలు

గణపురంలో మంత్రి కేటీఆర్‌ బర్త్ డే వేడుకలు

-భారీ వర్షాలకు నిరాశ్రయులైన బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ

స్పాట్ వాయిస్, గణపురం: రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలసాని లక్ష్మీ నర్సింగరావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. యువనేత మంత్రి కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా ఎన్నో విదేశీ కంపెనీలు తెలంగాణలో తమ సంస్థలను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. తన జన్మదినం సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని, వీలైనంత మందికి చేయూతగా నిలవండని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన బాధితులకు బియ్యం, నిత్యాసర వస్తువులు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్, నడిపెల్లి మధుసూదన్ రావు, కాల్య రజితబాబు, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్, మంద అశోక్ రెడ్డి, మారగాని సరస్వతి శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, నాయకులు కోల జనార్ధన్, బైరగాని కుమారస్వామి గౌడ్, గుజ్జ గంగాధర్ రావు, వడ్లకొండ నారాయణ గౌడ్, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, అయిత రమేష్, మామిడి నరసింహస్వామి, మోతె కరుణాకర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, దిండు రమేష్, హఫీజ్, దివి వంశీకృష్ణ, తిక్క రాధాకృష్ణ, వడ్ల యాదగిరి, తిక్క సంపత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments