Saturday, April 5, 2025
Homeరాజకీయంకే టీ ఆర్ గో బ్యాక్..

కే టీ ఆర్ గో బ్యాక్..

కే టీ ఆర్ గో బ్యాక్..

ఎన్ఎస్ యూఐ నినాదాలు..
కమలాపూర్ లో ఉద్రిక్తత..
బీ ఆర్ ఎస్ వెర్సెస్ కాంగ్రెస్

స్పాట్ వాయిస్, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ లో మంత్రి కే టీ ఆర్ పర్యటన లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ ఎస్ యూ ఐ నాయకులు మంత్రి పర్యటన ను నిరసిస్తూ ఆందోళన కు దిగారు. రోడ్డు పై నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న బీ ఆర్ ఎస్ శ్రేణులు కూడా ఎన్ ఎస్ యూ ఐ నేతలను ప్రతిఘటించే యత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలు కే టీ ఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో స్థానిక బీ ఆర్ ఎస్ నేతలు తీవ్ర అసహనాని కి గురయ్యారు. ఇరు వర్గాలను పోలీసులు అదుపులో కి తేవడానికి తీవ్రంగా శ్రమించారు. కాగా సీ ఎం స్థాయి వ్యక్తికి అంతటి చేదు అనుభవం ఎదురు కావడంతో నియోజకవర్గం మొత్తం చర్చనీయాంశం అయ్యింది.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments