మంత్రి కేటీఆర్
కేంద్ర మాటలపై ఫైర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు ఎత్తేస్తే.. దేశ ప్రజలకు పెట్రోలు రూ.70కి, డీజిల్ రూ.60కే అందించవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాన మంత్రి ఇటీవల రాష్ర్టాలు ఎక్సైజ్ సుకం తగ్గించాలని సూచించారు. అలాగే పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి చేసిన ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో పన్నులు పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. క్రూడ్ ఆయిల్ ధర 2014లో 105 డాలర్లు ఉండగా ఇప్పటికీ అంతే ఉందన్న కేటీఆర్… పెట్రోల్ ధర మాత్రం రూ.70 నుంచి 120కి ఎందుకు పెరిగిందో సమాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రి రీ ట్వీట్ చేశారు. కేంద్రంలోని నాన్ పర్ఫామెన్స్ అసెట్స్, పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు దీనికి కారణం కాదా అంటూ నిలదీశారు. రాష్ట్రాలకు నీతులు చెప్పే కేంద్ర ప్రభుత్వం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే పెట్రోలు రూ.70కి, డీజిల్ రూ.60కి ఈ దేశ ప్రజలకు అందించొచ్చని చెప్పారు.
అలా చేస్తే 70కి పెట్రోల్.. 60కి డీజిల్
RELATED ARTICLES
Recent Comments