స్వాగతం పలికిన ఓరుగల్లు ప్రతినిధులు
స్పాట్ వాయిస్, హన్మకొండ: మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన షురూ అయింది. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవితతో కలిసి మంత్రి కేటీఆర్ హెలికాప్టర్ దిగారు. రామన్న రాక సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. నగరంలో మంత్రి 236 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి రాక సందర్భంగా నగరం మొత్తం గులాబీ వనమైంది. పోటీపోటీగా నాయకులు ఫెక్లీలు, టీఆర్ తోరణాలు ఏర్పాటు చేశారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Recent Comments