కుడా గ్రౌండ్ లో కేటీఆర్ సభ
-వరంగల్ నగరం పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
-ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యేలు..
స్పాట్ వాయిస్, హన్మకొండ: హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. మంత్రి ఓరుగల్లు అభివృద్ధిపై జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. రామన్న సభ కోసం రెండు మూడు స్థలాలు చూడడం జరిగిందని అందులో
హన్మకొండ లోని హయగ్రీవ చారి (కూడా ) గ్రౌండ్లో సభ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ ఈ నెల 20వ సాయంత్రం 4గంటలకు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది సీఎం కేసీఆరే అన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్ తదితరులు ఉన్నారు.
Recent Comments