7న మంత్రి కేటీఆర్ రాక..
హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన..
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని దుర్గంపేట గ్రామ శివారులోని ఎన్ ఎస్సార్ కన్వెన్షన్ హాలులో 7న జరిగే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జ్యోతి దంపతుల కూతురు వివాహా విందు కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరకాల ఏసీపీ శివరామయ్య పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ప్రజలు హాజరు కానున్నందున, వారికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా పార్కింగ్, భోజన ఏర్పాట్ల గురించి స్థలాలను పరిశీలించారు. వరంగల్- భూపాలపట్నం జాతీయ రహదారికి సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నoదున్న ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాలసిన పార్కింగ్ ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగేంద్ర బాబు , సీఐ లు కుమార్, కిషన్, మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, ఎన్ ఎస్సార్ సంస్థల అధినేత సంపత్ రావు, నాయకులు కేశవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments