Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్ప్రకటన.. ఖాయమేనా..?

ప్రకటన.. ఖాయమేనా..?

కేటీఆర్ సీఎంగా ఫైనల్ అయ్యేనా..?
27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వినికిడి
హెచ్ఐసీసీలో భారీ ఏర్పాట్లు
గ్రామస్థాయి నుంచి తరలిరావాలని అధినేత పిలుపు
కొద్ది రోజులుగా ఇదే హాట్ టాపిక్

సీఎం.. కేటీఆర్.. కొద్ది రోజులుగా వినవస్తున్న నినాదం. టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన వర్గం పలు సందర్భాల్లో బాహాటంగానే చెప్పిన మాటలు. త్వరలోనే మా రామన్న సీఎం అవుతాడని అనేక వేదికలు, సభల్లో గొంతెత్తి చెప్పారు. ప్రతిపక్షాలు సైతం కేటీఆర్ కు సీఎం కుర్చీ అప్పగించేందుకు కేసీఆర్ చూస్తున్నారంటూ వ్యాఖ్యానించాయి. మరి ఆమాటలు నిజమయ్యే వేళా వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 27న నిర్వహించే టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేటీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ క్యాడరంతా ఉండే వేదిక కావడంతో అధినేత అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి

ప్రస్తుతం రాష్ర్ట రాజకీయం వేడి మీద ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తయో.. తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రజల ముందు కోట్లాడుకుంటున్నాయి. వీటన్నింటికి మించిన హాట్ టాపిక్ ఇప్పుడు రాష్ర్టంలో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ సీఎం నినాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్‌లో శ్రేణులతో నిర్వహించే ఏ సభ, సమావేశంలో అయినా కేటీఆర్ ను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో మరోసారి అంశంపై తెరపైకి వచ్చింది. ఈనెల 27వ తేదీన నిర్వహించే టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ జిల్లా, మండల అధ్యక్షుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు సమాచారం.

ఎన్నికలకు ముందా.. వచ్చే ఎన్నికల్లోనా..?
రాష్ర్ట రాజకీయలో త్వరలోనే కీలక మార్పులు రాబోతున్నాయనే వార్తలు వినివస్తున్నాయి. ముఖ్యమంత్రి సీట్లో కేటీఆర్ కూర్చోబోతున్నారని చర్చ నడుస్తోంది. సొంత పార్టీతో పాటు.. ప్రతిక్షాలు సైతం ఈ అంశంపై చర్చిస్తున్నాయి. ఛరిష్మా ఉన్న నాయకుడు కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీకి చెందిన పలువురు నేతలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రులు సైతం బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం కేసీఆర్ మదిలో సీఎంగా కేటీఆర్ ను ప్రకటించాలని ఉన్నా.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఎలా అనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే కేటీఆర్ ను సీఎంగా చూడడం పక్కా అని.. అది ఈసారేనా.. లేక వచ్చే ఎన్నికల తర్వాతనే అనే చిక్కుముడిలో ఉంది.

మళ్లీ తెరపైకి..
కేటీఆర్ పార్టీ విషయాల్లో చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు పార్టీలోని పరిస్థితులపై ఆరా తీస్తూ సమీక్షించుకుంటున్నారు. అన్ని అంశాల్లోనూ ఆక్టివ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను సీఎం చేయాలని వరుసగా డిమాండ్లు రావడం, సీఎం కేసీఆర్ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో కొద్దిరోజులుగా ఈ చర్చ బయటికి వినిపించడం లేదు. అయితే లోలోపల తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయనే ఊహాగానాలు రావడంతో వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కేటీఆర్ ఉంటారని ఆయన అభిమానులు చెబుతున్నారు. కేసీఆర్ సైతం మూడోసారి విజయదుందుభీ మోగించి.. రాష్ర్ట పగ్గాలు కేటీఆర్ కు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవంలో ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని వినికిడి. ఈ వేడుకకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులు హాజరుకానున్న నేపథ్యంలో కేటీఆర్ సీఎం అంశం తెరపైకి వచ్చింది. ఈ వేడుక సాక్షిగా అధినేత అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిపెట్టడంతో పాటు, బీజేపీకి వ్యతిరేక పార్టీలతో చెలిమి చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా దేశ రాజకీయలపై వైపు అడుగులు వేస్తాడని, రాష్ర్టంలో కేటీఆర్ సీఎంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కేటీఆర్ డైనమిక్ లీడర్ అని, ఆయనకు సీఎం పదవి కట్టబెట్టాలని వేదికలపై వ్యాఖ్యనించారు. అలాగే కేటీఆర్‌ను సీఎం చేయాలంటూ టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి కుమారుడు ప్రశాంత్ మేడారంలో సమ్మక్క సారలమ్మను మొక్కుకున్నారు. ఆయనతో పాటు వెయ్యి మంది యువకులు ర్యాలీగా మేడారం వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments