Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుకేటీపీపీ క్షతగాత్రులకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

కేటీపీపీ క్షతగాత్రులకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో గత సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. వీరిలో జేపీఏ వెంకటేశ్వర్లు, సీతారాము హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదివారం హాస్పిటల్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుంటారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారన్న విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకరాగా వెంటనే జేన్కో సీఈ సిద్ధయ్యకు ఫోన్లో సమస్య వివరించి వెంటనే పేషంట్ కుటుంబ సభ్యులు ఉండటానికి భోజన, వసతి సదుపాయం కలిపించాలని ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే 24 గంటలు అందుబాటులో ఉంటానని, తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments