బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
కేటీపీపీ ఎదుట ఆందోళనకు దిగిన ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్/గణపురం: భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు జెన్ కో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెన్ కోలో భూ కోల్పోయిన బాధితుడు మర్రి బాబు కొడుక్కు ఉద్యోగం ఇవ్వాలంటూ తిరిగి తిరిగి వేశారాడు. కేటీపీపీ ఎదుట ఆత్మహత్యకు యత్నిస్తే కేవలం ఆస్పత్రిలో చేర్పించి యాజమాన్యం చేతులు దులుపుకుంది. దీంతో ఆస్పత్రిలో బిల్లు కట్టలేక.. ఉద్యోగం వస్తుందనే ఆశ లేక గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పట్టణంలోని స్మార్ట్ కేర్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, వైఎస్సార్ టీపీ, జనసేన, టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. అక్కడి నుంచి జెన్ కో వద్దకు చేరుకొని నిరసన చేపట్టగా భారీగా పోలీసులు మోహరించారు. ధర్నాకు దిగిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. బాధితుడికి న్యాయం చేయాలని, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సత్తన్నను అడ్డుకున్న పోలీసులు
జెన్ కో భూ నిర్వాసితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని జెన్ కో వద్దకు వెళ్తున్న గండ్ర సత్తన్న మోరంచపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి వెళ్లకుండా ఆపారు.
Recent Comments