* ప్రత్యేక స్థానం కల్పించిన కేంద్రం
* సాస్కి స్కీమ్ తో కోటగుళ్లు, గణపసముద్రం సరస్సు అభివృద్ధి
* రామప్ప, కోటగుళ్లు, గణపసముద్రం, ఇంచర్ల అభివృద్ధి కి రూ.73.74 కోట్లు కేటాయింపు
* నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల
* అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన కేంద్ర పర్యాటక శాఖ
* టూరిజం హబ్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం
స్పాట్ వాయిస్, గణపురం : 800 ఏళ్లకు పైగా చరిత కలిగిన కాకతీయుల కళా వైభవానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కాకతీయుల వారసత్వ సంపద అయిన కోటగుళ్లు కొత్త రూపు సంతరించుకోనుంది. కాకతీయులు నిర్మించిన రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడగా, ఇప్పుడు రామప్ప సరసన కోటగుళ్లకు ప్రత్యేక స్థానం దక్కింది. రామప్ప దేవాలయ అభివృద్ధితో పాటు శిథిలమవుతున్న కోటగుళ్ల అభివృద్ధికి స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ (సాస్కి) స్కీమ్ ద్వారా చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.
యునిస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయం కోటగుళ్లకు త్వరలో మహర్దశ పట్టనుంది. రామప్ప, కోటగుళ్లతోపాటు గణప సముద్రం సరస్సు, రామప్ప సమీపంలోని ఇంచర్ల గ్రామాన్ని కూడా సాస్కి పథకంలో చేర్చి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. కాగా, కాకతీయుల కట్టడాలకు రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆలయాలభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కేంద్ర పర్యాటక, సాంస్కృ తిక శాఖ ఆధ్యాతిక వారసత్వ వృద్ధి పథకం (ప్రసాద్) 2022లో చేర్చింది. సాస్కీ స్కీం ద్వారా మరింత అభివృద్ధి చేయనుంది.
రామప్ప సరసన కోటగుళ్లకు స్థానం
రామప్ప, కోటగుళ్లు రెండు ఆలయాలను కాకతీయులు నిర్మించినప్పటికీ రామప్పకు మాత్రం ప్రపంచ పటంలో స్థానం దక్కింది. శిథిలావస్థకు చేరిన కోటగుళ్లు నిరాధారణకు గురికాగా 18 ఏళ్ల క్రితం కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి దాతల సహకారంతో ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఆలయ ప్రాంగణంలో గోశాలను నిర్మించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. కళ్యాణాన్ని సందర్శించేందుకు పర్యటకులు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రామప్పకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటగుళ్ల అభివృద్ధికి నడుం బిగించింది. కోటగుళ్లు, గణప సముద్రం సరస్సు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి. గతంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించి కొంత పనులు మాత్రమే పూర్తి చేసింది.
టూరిజం హబ్ లో స్థానం దక్కించుకున్న కోటగుళ్లు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించక మరుగునపడి శిథిలావస్థకు చేరుకున్న కోటగుళ్ల ఆలయం నేడు కేంద్ర ప్రభుత్వంసాస్కి పథకంలో రామప్ప తో పాటు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూ. 73.74 కోట్లు కేటాయించింది. దీంతో కేంద్ర పర్యాటక శాఖ నూతనంగా తయారు చేసే టూరిజం హబ్ లో కోటగుళ్లకు స్థానం దక్కింది.
కోటగుళ్లలో సాస్కి స్కీమ్ లో చేయనున్న పనులు ఇవే..
స్కల్ప్చర్ గార్డెన్, కొత్త రకమైన పరికరాలతో పిల్లల ఆట స్థలం, పార్కింగ్ ప్రాంతం, సీలింగ్ మండపం, సీటింగ్ బెంచీలు, తాగునీరు, డస్ట్ బిన్‌లు, సంకేతాలు, ఆన్-సైట్ ల్యాండ్‌స్కేపింగ్. ఆన్‌సైట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ తదితర పనులు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ పథకంలో చేయనున్నారు.
గణపసముద్రం సరస్సు కట్ట సుందరీకరణ కోసం
గణపసముద్రం సరస్సులో సెక్యూరిటీ, ఎంట్రన్స్ గేట్, పార్కింగ్ ప్రాంతం. అడ్మిన్, రెస్టారెంట్, వాష్‌రూమ్‌లు, లేక్ వ్యూ వాక్‌వే. పిల్లల ఆట స్థలం, లేక్ వ్యూ కాటేజీలు. 6 ఎం వెడల్పు గల సీసీ రోడ్, నిర్మాణం మెడ్ ల్యాండ్ స్కేపింగ్‌తో పాదచారుల మార్గం, లేక్ వ్యూ.
పాయింట్, ఫ్లోటింగ్ జెట్టీ, బోటింగ్ పాయింట్ పనులు ఏర్పాటు చేయనున్నారు.
Recent Comments