స్పాట్ వాయిస్, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. జూలై 1వ తేదీన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరతారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్ తరఫున 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2018లో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతా రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య.
Recent Comments