Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలుకొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

స్పాట్ వాయిస్, చేర్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో కొమురవెల్లికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కుల రూపంలో కేషఖండన, అభిషేకం, నిత్య కల్యాణం, గంగరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ గిస భిక్షపతి తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగ శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుడి మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజరులు, ఆలయ సిబ్బంది సార్ల విజయ్ కుమార్, నర్సింహులు, మాధవి తదితరులు భక్తులకు సేవలందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments