Wednesday, January 22, 2025
Homeజిల్లా వార్తలులక్ష్మీగణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ

లక్ష్మీగణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో పతంగుల పంపిణీ

స్పాట్ వాయిస్, వరంగల్: లక్ష్మీగణపతి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కాశిబుగ్గ చౌరస్తాలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షుడు వంగరి రాంప్రసాద్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పతంగుల పంపిణీ, చలివేంద్రం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమలను చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మండల సురేష్, ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు, దాసి శివకృష్ణ , కోశాధికారి దుస్సా కృష్ణ, పసునూటి శ్రీకాంత్, మండల చంద్రశేఖర్, మామిడాల సతీష్, బండారి లక్ష్మణ్, గాదె జగన్, వంగరి రవి, గోనె సతీష్, వంగ ఐలయ్య ,కూచన సతీష్, గుండా యుగేందర్, కూరపాటి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments