Sunday, April 6, 2025
Homeలేటెస్ట్ న్యూస్మానుకోటలో పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ కలకలం..

మానుకోటలో పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ కలకలం..

పిల్లలను ఎత్తుకెళ్తుండగా పట్టుకున్న స్థానికులు
పోలీసుల అదుపులో నిందితుడు..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: పిల్లల కిడ్నాపింగ్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. తాజాగా మహబూబాబాద్ పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లడానికి దుండగలు ప్రయత్నించారు. పట్టణంలోని ఇల్లందు బైపాస్ వైఎస్సార్ స్టాచ్ దగ్గర ఘటన… పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్‌కు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని.. దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments