Friday, September 20, 2024
Homeక్రైమ్హన్మకొండలో కిడ్నాప్ కలకలం..

హన్మకొండలో కిడ్నాప్ కలకలం..

హన్మకొండలో కిడ్నాప్ కలకలం..
స్పాట్ వాయిస్, క్రైం: హన్మకొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీ -2 లో బాలుడి కిడ్నాప్ కు యత్నించడం కలకలం సృష్టించింది. డాక్టర్స్ కాలనీలోని మసీదు దగ్గరి ఏరియాలో చిన్న బాబును సంచిలో మూటగట్టుకుని పట్టుకుపోతున్న మహిళను స్థానికులు పట్టుకున్నారు. 4 ఏళ్ళ బిట్టు అనే బాలుడి మూతి, చేతులు కట్టేసి సంచిలో వేసుకొని, పారిపోతుంటే, కాలనీ వాసులు పట్టుకున్నారు. బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసే ప్రయత్నం చేసే మహిళ బండారం బయట పడగానే మానిసిక పరిస్థితి సరిగా లెన్నట్లుగా నటించి, పారిపోవాలని చూసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments