పోలీస్ సేవలపై అవగాహన కలిగి ఉండాలి
ఖానాపురం ఎస్సై తిరుపతి
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఖానాపురం ఎస్సై పిట్టల తిరుపతి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అశోక్ నగర్, ధర్మరావుపేట, బుధరావుపేట గ్రామాలలో సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి మాట్లాడుతూ ప్రజలు డయల్ 100, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్ తదితర కార్యక్రమాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలను నియంత్రించవచ్చని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ సేవలపై అవగాహన కలిగి ఉండాలి
RELATED ARTICLES
Recent Comments