Friday, September 20, 2024
Homeటాప్ స్టోరీస్70ఏండ్లు.. 70 అడుగులు

70ఏండ్లు.. 70 అడుగులు

ఖైరతాబాద్ గణపతి కి 70 ఏండ్లు.. 

70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ 

శ్రీ సప్తముఖ మహాశక్తిగా దర్శనం ఇవ్వనున్న లంబోదరుడు..

స్పాట్ వాయిస్, బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడిని ప్రారంభించి 70 ఏళ్లైనా సందర్భంగా 70 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ మేరకు విగ్రహానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని కమిటీ ఆవిష్కరిచింది. ఖైరతాబాద్ వినాయకుడు   విగ్రహానికి కుడివైపున శ్రీనివాసుని కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది విగ్రహం వద్ద అయోధ్య బాలరాముడిని కూడా ప్రతిష్ఠించనున్నారు. విగ్రహ పనులు ఇప్పటికే మొదలుకాగా ఎలాంటి లోపాలు లేకుండా విగ్రహ తయారీ పూర్తి చేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments