Wednesday, September 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ రిలీజ్..

ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ రిలీజ్..

ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ రిలీజ్..
15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
 స్పాట్ వాయిస్‌, హైదరాబాద్:  రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని www.tslprb.in లో అందుబాటులో ఉంచింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 15 వరకు స్వీకరిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 544 ఎస్సై పోస్టుల కోసం ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్ విడుదల కాగా.. 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 7న జరిగిన ప్రాథమిక పరీక్షకు 91.32 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 2,25,759 మంది పరీక్ష రాసినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments